passenger auto rickshaw

ఎలక్ట్రిక్ మొబిలిటీ పెరుగుదల మరియు స్థిరమైన ట్రాన్స్పోర్టేషన్ వైపు పుష్ చేయడంతో, భారతదేశంలోని అనేక అర్బన్ మరియు  సబ్ అర్బన్ ప్రాంతాలలో E -ఆటో రిక్షాలు ఒక ప్రసిద్ధ రవాణా మార్గంగా మారాయి. దేశంలోని వివిధ ప్రాంతాలలో E -రిక్షాలు, టుక్-టుక్‌లు మరియు టోటోలు అని కూడా పిలువబడే ఈ 3- వీల్ వెహికల్ ఎలక్టిసిటీతో నడిచేవి. ఇది ప్రయాణికులకు తక్కువ ఖర్చుతో కూడుకున్న ఆప్షన్ గా మరియు అధిక లాభాలను కోరుకునే యజమానులకు ఆర్థికంగా లాభదాయకమైన వెహికల్.

E -ఆటో రిక్షాలను ఎందుకు ఎంచుకోవాలి?

E- ఆటో రిక్షాలు ఎక్కువగా పాపులర్ అవడానికి అనేక కారణాలు ఉన్నాయి:

ఖర్చుతో కూడుకున్నది:  సాంప్రదాయ రిక్షాల కంటే E -రిక్షాలు ఫ్యూయల్ మరియు మెయింటెనెన్స్ కాస్ట్ తక్కువ కలిగి ఉన్నందున వాటిని ఆపరేట్ చేయడానికి చీప్ గా ఉంటాయి.

నడపడం సులభం: సహజంగా E -రిక్షాలు  ఆటో గేర్ ట్రాన్స్‌మిషన్ తో వస్తాయి. ఈ కారణంగా నడపడం సులభం.  డ్రైవింగ్ అనుభవం తక్కువ ఉన్న వారికి ఇది మంచి ఆప్షన్.

సౌలభ్యం: E -రిక్షాలు ఫాస్ట్ యాక్సిలిరేషన్  కలిగి ఉంటాయి మరియు రద్దీగా ఉండే వీధుల గుండా సులభంగా నావిగేట్ చేయగలవు, రద్దీగా ఉండే రోడ్‌లకు ఇది ఉత్తమ ఆప్షన్.

పర్యావరణ అనుకూలత: E-రిక్షాలు అస్సలు కాలుష్యం విడుదల చేయవు మరియు వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో సహాయపడతాయి.

భారతదేశంలో పాపులర్ E-ఆటో రిక్షా మోడల్‌లు

భారతదేశంలో అనేక E -ఆటో రిక్షా మోడల్‌లు అందుబాటులో ఉన్నాయి, ప్రతి ఒక్కటి దాని ప్రత్యేక లక్షణాలు మరియు ప్రయోజనాలు కలిగి వున్నాయి. ఇక్కడ అత్యంత ప్రజాదరణ పొందిన కొన్ని మోడల్స్ ఉన్నాయి:

మోంట్రా ePV2.0: ఇది మోడరన్ డిజైన్‌తో కూడిన స్టైలిష్ మరియు ఫీచర్-రిచ్ E-రిక్షా మోడల్.

Piaggio Ape ECity FX: ఇది మన్నిక, పరిధి మరియు పనితీరుకు ప్రసిద్ధి చెందిన ప్రీమియం ఇ-రిక్షా మోడల్.

Piaggio Ape ECity FX Max: ఇది సుదీర్ఘ రేంజ్ మరియు మరిన్ని ఫీచర్లతో Ape ECity FX యొక్క అప్‌గ్రేడ్ వెర్షన్.

Mahindra Treo Plus HRT: మహీంద్రా ఆటో రిక్షా యొక్క ఈ వేరియంట్ సౌకర్యవంతమైన మరియు విశాలమైన ఇ-రిక్షా, ఇది అధిక గ్రౌండ్ క్లియరెన్స్ మరియు కారు లాంటి హర్డ్ రూఫ్‌తో ఉంటుంది.

Mahindra Treo Plus  SFT: ఇది సమర్థతపై దృష్టి సారించే మరింత అందుబాటులో వున్న E-రిక్షా మోడల్.

Bajaj RE E-Tech 9.0: ఎలక్ట్రిక్ బజాజ్ ఆటో రిక్షా అనేది సుదీర్ఘ రేంజ్ తో కూడిన శక్తివంతమైన మరియు దృఢమైన  E-రిక్షా మోడల్.

భారతదేశంలో E- ఆటో రిక్షా ధర

E ఆటో రిక్షా ధరలు మోడల్, బ్యాటరీ సామర్థ్యం మరియు ఇతర ఫీచర్లను బట్టి మారవచ్చు. అయితే, E -రిక్షా స్టార్టింగ్ ప్రైస్ సుమారు 3.2 లక్షల నుండి ప్రారంభం. రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీపై ఆధారపడి వివిధ రాష్ట్రాల్లో ఎలక్ట్రిక్ ఆటో రిక్షా ధరలో కూడా తేడా వుండవచ్చు.

ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన  ప్రభుత్వ  ఇన్సెంటివ్స్ - FAME II సబ్సిడీ

"హైబ్రిడ్ మరియు ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క ఫాస్టర్ అడాప్షన్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ (FAME II)" అనేది దేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ (EVలు) అభివృద్ధి మరియు అడాప్షన్ పెంచడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన స్కీమ్. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి ప్రపంచ ప్రయత్నాలలో ఈ చొరవ కీలకమైనది. EVలను మరింత అందుబాటులోనికి తీసుకురావడానికి  వివిధ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ అందించడం ద్వారా ఎలక్ట్రిక్ వెహికల్స్ లో  పెట్టుబడి పెట్టడానికి వ్యక్తులను మరియు బిజినెస్ లను ప్రోత్సహించాలని భారత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. FAME II అందించే ప్రయోజనాల జాబితా ఇక్కడ ఉంది:

కొనుగోలు ఇన్సెంటివ్స్: ఎలక్ట్రిక్ వెహికల్  మొత్తం ధరను తగ్గించడం ద్వారా వినియోగదారులకు ప్రత్యక్ష డిస్కౌంట్స్  అందించబడతాయి.

కూపన్‌లు: కూపన్‌ల రూపంలో ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ మొత్తం తర్వాత తిరిగి రిఎంబర్స్ చేయబడుతుంది.

వడ్డీ రాయితీలు: ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలు చేయడానికి తీసుకున్న లోన్‌పై  వడ్డీ రేటుపై తగ్గింపు లభిస్తుంది.

రోడ్డు టాక్స్  మినహాయింపు: వెహికల్ కొనుగోలు సమయంలో రోడ్డు టాక్స్ మినహాయింపు ఇవ్వబడుతుంది.

రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపు: కొత్త వెహికల్  కొనుగోళ్లకు వర్తించే వన్-టైమ్ రిజిస్ట్రేషన్ ఫీజు నుండి మినహాయింపు ఇవ్వబడుతుంది.

ఇన్కమ్ టాక్స్ బెనిఫిట్స్: ఒక వ్యక్తి ప్రభుత్వానికి చెల్లించాల్సిన టాక్స్ మినహాయింపు ఇవ్వబడుతుంది.

స్క్రాపింగ్ ఇన్సెంటివ్స్ : పాత పెట్రోల్ మరియు డీజిల్ వెహికల్  రిజిస్ట్రేషన్ రద్దు చేసిన తర్వాత ఇన్సెంటివ్స్ ఇవ్వబడుతుంది.

ఈ సమగ్ర ప్రయోజనాల సమితి ఎలక్ట్రిక్ వాహనాలను మరింత ఆకర్షణీయంగా మరియు విస్తృత ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది, ప్రభుత్వ నిబద్ధత పర్యావరణ సుస్థిరత పట్ల మరియు ట్రెడిషినల్ ఫ్యూయల్  వనరులపై ఆధారపడటాన్ని తగ్గించడం.

E-ఆటో రిక్షాలకు సబ్సిడీ రూ. 10,000. కిలోవాట్‌కి పొందండి.

సోర్స్ : E-Amrit

E-ఆటో రిక్షాలను ఎక్కడ కొనాలి

Passenger electric autorickshaw

E-ఆటో రిక్షాలను బ్రాండ్ డీలర్‌షిప్‌ల నుండి కొనుగోలు చేయవచ్చు. అయితే, మీరు అన్ని అగ్రశ్రేణి ఎలక్ట్రిక్ ఆటో-రిక్షాలను ఒకే పైకప్పు నందు రీసెర్చి చేయాలనుకుంటే, కంపేర్  చేయాలనుకుంటే మరియు ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే, మీరు భారతదేశపు నంబర్ 1 మల్టీబ్రాండ్ EV డీలర్ అయిన టర్నోను తప్పక సందర్శించాలి. టర్నో అనేది అన్ని కమర్షియల్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి ఒకే ఒక-స్టాప్ సొల్యుషన్. మీ కమర్షియల్ ఎలక్ట్రిక్ ఆటో యొక్క మొత్తం కొనుగోలు విధానం టర్నోచే నిర్వహించబడుతుంది - రీసేల్  సరైన వాహనాన్ని ఎంచుకోవడం నుండి ప్రారంభించి. టర్నో అన్ని బెస్ట్ సెల్లింగ్ ఎలక్ట్రిక్ ఆటో-రిక్షా మ్యానుఫ్యాక్చరర్స్ తో  భాగస్వామ్యాన్ని కలిగి ఉంది, అంటే, ప్యూజియో, మహీంద్రా, బజాజ్ మరియు మోంట్రా.

టర్నో 5-రోజుల వెహికల్ డెలివరీతో పాటు ఎలక్ట్రిక్ ఆటో-రిక్షాల కోసం 100% హామీతో కూడిన ఫైనాన్సింగ్‌ను అందిస్తుంది. టర్నో యొక్క ఫ్రీ మొబైల్ యాప్‌తో, అనేక ఇతర వెహికల్ మరియు లోన్-సంబంధిత వివరాలతో పాటు బ్యాటరీ హెల్త్ రియల్ టైమ్ ట్రాక్ చేయవచ్చు. టర్నో 36 నెలల తర్వాత రీసేల్ హామీ కూడా ఇస్తుంది.

కంక్లూషన్

E-ఆటో రిక్షాలు భారతీయ ఆటో ఇండస్ట్రీని మార్చే ఒక స్థిరమైన మరియు అందుబాటు ధరలో ట్రాన్స్పోర్టేషన్ ఆప్షన్స్  ప్రభుత్వ మద్దతు మరియు E-రిక్షాల ప్రయోజనాల గురించి అవగాహన పెంచుకోవడంతో, రాబోయే సంవత్సరాల్లో రోడ్లపై మరిన్ని E-రిక్షాలను చూడొచ్చని మనం ఆశించవచ్చు.

Click to read this blog in English/Hindi/Kannada